![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -960 లో.. కొందరు రౌడీలు వసుధారని రిషి ఉన్న దగ్గరకి తీసుకొని వచ్చి.. నువ్వు డోర్ తియ్యకపోతే వసుధారని చంపేస్తామంటూ రౌడీలు రిషిని బెదిరిస్తున్నట్లు రిషి కలకంటాడు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వసుధార అంటూ గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న ముసలివాళ్ళు ఏమైందంటు అడుగుతారు. తొందరలోనే మీ వాళ్ళని కలుస్తావ్.. నువ్వు ఏమి బాధపడకంటు ఆ ముసలివాళ్ళు రిషికి చెప్తారు.
మరొకవైపు భద్ర ఇంట్లో కరెంటు ఆఫ్ చేసి.. వసుధార అనుకొని అనుపమ ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుంటే లోపల నుండి వసుధార వాయిస్ వినిపిస్తుంది. అక్కడ వాయిస్ వినిపిస్తే మరి ఇక్కడ ఉందెవరని చూసేసరికి అనుపమ ఉంటుంది. దాంతో తనని కిందపడుకోపెట్టి పక్కకి వెళ్లిపోతాడు భద్ర. మరొకవైపు అనుపమ కన్పించడం లేదని మహేంద్రకి వసుధార చెప్తుంది. దాంతో వాళ్ళు బయటకు వచ్చేసరికి అనుపమ కిందపడిపోయి ఉంటుంది. ఏమైందని వసుధార, మహేంద్రలు కంగారుపడుతుంటారు. అప్పుడే భద్ర వచ్చి ఎవరో రౌడీలు మేడమ్ ని తీసుకొని వెళ్తుంటే సౌండ్ వచ్చి లేచాను. నేను వాళ్ళని పట్టుకుందామని వెళ్లేసరికి వాళ్ళు పారిపోయారని భద్ర చెప్తాడు. ఆ తర్వాత అనుపమని ఇంట్లోకీ తీసుకొని వస్తారు. స్పృహ లొకి రాగానే జరిగిందంతా మహేంద్ర చెప్తాడు. నిన్ను ఎవరో కిడ్నాప్ చేయాబోతుంటే భద్ర కాపాడాడని అనుపమకి మహేంద్ర చెప్తాడు. అతను కిడ్నాప్ చేయాలి అనుకుంది నన్ను కాదు వసుధారని అని అనుపమ చెప్తుంది. అవునని మహేంద్ర అంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండని మహేంద్ర చెప్తాడు. వసుధారని ప్రొటెక్ట్ చేస్తూ ఉండమని భద్రకి మహేంద్ర చెప్తాడు. దానికి భద్ర సరే అంటాడు. నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావ్ కానీ ఈసారి మిస్ అవ్వదని భద్ర అనుకుంటాడు.
మరొకవైపు భద్ర ఇంక ఫోన్ చెయ్యలేదని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే భద్ర ఫోన్ చేస్తాడు. అది చూసిన శైలేంద్ర కంగారుగా పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అలా వెళ్లడం ధరణి చూసి.. ఈయన ఇక మారరని అనుకుంటుంది. అ తర్వాత భద్ర జరిగింది మొత్తం శైలేంద్రకి చెప్పగానే తను డిజప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత నా మాటలు ధరణి ఏమైనా విందా అని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు రిషి మాత్రం వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉందా అని రిషి అడుగుతాడు. లేదని అక్కడున్న ముసలివాళ్ళు చెప్తారు. నేను ఇప్పుడు మా వాళ్ళని కలవకున్నా కూడా ఫోన్ మాట్లాడాలని రిషి అనగానే.. సరే ఎవరినయినా అడిగి తీసుకొని వస్తానని ఆ పెద్దాయన వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |